వన్‌ప్లస్ బ్యాండ్ వచ్చేసింది!

11 Jan, 2021 15:21 IST|Sakshi

మొబైల్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన మొదటి ఫిటెనెస్ బ్యాండ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇటీవలే దీనికి సంబందించిన కొన్ని ఫోటోలను మనతో సంస్థ పంచుకుంది. వన్‌ప్లస్ బ్యాండ్ కోసం ‘నోటిఫై మి’ అనే ఆప్షన్ తో కూడిన ఒక ప్రత్యేకమైన పేజీని అమెజాన్ ఇండియా సృష్టించింది. అలాగే వచ్చే ఏడాది చివరి కల్లా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనున్నట్లు వన్‌ప్లస్ పేర్కొంది. భారతదేశంలో వన్‌ప్లస్ బ్యాండ్ ధర రూ. 2,499 గా ఉంటుందని మేము గతంలోనే పేర్కొన్నాము. జనవరి 13న అమెజాన్, ఫ్లిప్ కార్టు వెబ్ సైట్ లలో ఫస్ట్ సేల్ కి రానుంది. (చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి)

వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్:
వన్‌ప్లస్ బ్యాండ్ లో 1.4 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ లో రియల్ టైమ్ హార్ట్ రేట్ ట్రాకింగ్, స్పా 2బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 13 వ్యాయామ మోడ్‌లు, 3–యాక్సిస్ యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.ఓ, ఐపీ 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇది 50 మీటర్ల లోతు వరకు కూడా పనిచేస్తుంది. అవుట్డోర్ రన్, సైక్లింగ్, క్రికెట్, పూల్ స్విమ్, యోగా వంటి ఇతర వ్యాయామాలను ఇది ట్రాక్ చేయగలదు. వన్‌ప్లస్ హెల్త్ యాప్ ద్వారా వన్‌ప్లస్ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్లో కూడా పనిచేస్తుంది. దీనిలో అందించిన 100ఎంఏహెచ్ బ్యాటరీ 14 రోజుల వరకు పనిచేయగలదు. దీని బరువు కేవలం 10.3 గ్రాములు మాత్రమే ఉంటుంది. 
 

మరిన్ని వార్తలు