టపా టప్‌: మాట్లాడుతుండగా టపాసుల్లా పేలిన స్మార్ట్‌ఫోన్‌.! యువకుడికి గాయాలు!

4 Apr, 2022 12:47 IST|Sakshi

Oneplus Nord 2 Blast: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలెర్ట్‌. ఇటీవల కాలంలో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ పేలుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు చైనా స్మార్ట్‌ తయారీ సంస్థకు చెందిన 5జీ వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌2 మాట్లాడుతుండగా పేలింది. ఫోన్‌ పేలడంతో బాధితుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వైరల్‌ అవుతున్న వీడియోలు, ఫోటోలు స్మార్ట్‌ ఫోన్‌ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

న్యూఢిల్లీ చెల్లి చెందిన 'లక్ష్య వర్మ' అనే ట్విట్టర్‌ మార్చి31,2022న యూజర్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌2 విషయంలో తన తమ్ముడికి జరిగిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.  

నా తమ్ముడు వన్‌ప్లస్‌ నార్డ్‌2 స్మార్ట్‌ఫోన్‌'లో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆఫోన్‌ పేలింది. తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించాం. న్యాయం కోసం వన్‌ప్లస్‌ సర్వీస్‌ సెంటర్‌ ప్రతినిధుల్ని ఆశ్రయించాను. 2,3 రోజుల తర్వాత సర్వీస్‌ సెంటర్‌ ప్రతినిధులు పేలిన స్మార్ట్‌ఫోన్‌ను కలెక్ట్‌ చేసుకున్నారే తప్పా ఏం చేయలేదు. 

@OnePlus_IN హ్యాష్‌ ట్యాగ్‌కు వన్‌ప్లస్‌ మోటివేషనల్‌ కోట్‌ NEVER SETTLE?? ను యాడ్‌ చేస్తూ.. ఇది జోక్‌ కాదు. నా తమ్ముడు ఫోన్‌ మాట్లాడుతుండగా వన్‌ప్లస్‌ నార్డ్‌2 ఫోన్‌ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నష్టపరిహారమో, ఇంకేదో కావాలని మేం అడగం లేదు. ఒకటే అడిగేది మాకు న్యాయం చేయమని. కానీ ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకేం చేయలేం' అంటూ విచారం వ్యక్తం చేశాడు.

      

ఫోన్‌ మెటల్‌ మొహంపై గుచ్చుకున్నాయి
ఫోన్‌ మెటల్‌ మొహంపై గుచ్చుకున్నాయంటూ వర్మ ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు. మాట్లాడుతుండగా వన్‌ప్లస్‌ నార్డ్‌2 పేలడంతో..ఆఫోన్‌ మెటల్‌ నా తమ్ముడి మొహంపై, చేతిలో గుచ్చుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంటే వర్మ పోస్ట్‌ చేసిన వీడియోలో వన్‌ ప్లస్‌ నార్డ్‌2 ఫోన్‌ పేలి పొగలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

అయితే వర్మ వరుస ట్వీట్‌లతో వన్‌ప్లస్‌ యాజమాన్యం స్పందించింది. మీ తమ్ముడి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీరు మాకు డైరెక్ట్‌గా మెసేజ్‌ చేయండి. వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామంటూ రిప్లయి ఇచ్చింది.

చదవండి: అన్నా.. మొబైల్‌ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..

మరిన్ని వార్తలు