ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్ఫోన్ తో పాటు వన్ప్లస్ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
వన్ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా):