త్వరలో వన్ ప్లస్3 5జీ ఫోన్‌ విడుదల, ధర ఎంతంటే?

14 May, 2023 14:26 IST|Sakshi

5జీ స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు శుభవార్త. భారత్‌లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నెలలో వన్ ప్లస్ నార్డ్3 5జీతో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ రిలీజ్ కానుంది. 

ఇక ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో విడుదల కానుంది. 
  
వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు