వన్‌ప్లస్‌ ప్యాడ్‌ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!

25 Apr, 2023 17:01 IST|Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వన్‌ప్లస్ టాబ్లెట్ విభాగంలో తన అరంగేట్రం చేసింది. తన తొలి ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. MediaTek Dimensity 9000 చిప్‌సెట్‌,  కార్టెక్స్-X2 కోర్ 3.05GHz తదితర ఫీచర్లతో  దీన్ని తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 35శాతం పనితీరు ప్రయోజనాన్ని,  35 శాతం పవర్‌ ఎఫిషియెన్సీ అందజేస్తుందని  కంపెనీ వెల్లడించింది. 

(ఇదీ  చదవండి: బిచ్చగాళ్లను  పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం)

వన్‌ప్లస్  ప్యాడ్: ధర, ఆఫర్‌లు
వన్‌ప్లస్  ప్యాడ్ రెండు  స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.  8జీబీ  ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌,  12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లలో లాంచ్‌  చేసింది. వీటి ధరలు  రూ. 37,999,  రూ. 39,999.   వన్‌ప్లస్  యాప్‌, ఎక్స్‌పీరియన్స్  స్టోర్‌తోపాటు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌  ఈకామర్స్‌ సైట్లలోనూ,  రిలయన్స్ క్రోమా స్టోర్‌లలో  అందుబాటులో  ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు  క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

OnePlus Xchange  కింద  వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ల మార్పిడిపై అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్‌ లభిస్తుంది.  ఏప్రిల్‌ 28 నుంచి  ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు.  ఓపెన్ సేల్  మే 2, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. (ఏఐపై ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో)

వన్‌ప్లస్‌  ప్యాడ్‌ ఫీచర్లు 
భారీ 11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్‌ప్లే
7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ 
2.5D రౌండ్ ఎడ్జ్ .కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్‌
144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ ,  డాల్బీ అట్మోస్ సపోర్ట్‌
9510mAh బ్యాటరీ 67w  ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ 
13 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా

మరిన్ని వార్తలు