మరో కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా..!

19 Jun, 2021 17:59 IST|Sakshi

ముంబై: ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెటర్‌ జస్ప్రిత్‌ బుమ్రాను ఎంచుకుంది. కంపెనీ తయారీ చేసిన వేరబుల్‌ విభాగపు ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు బుమ్రా డిజిటల్‌ ఫ్లాట్‌పామ్‌ వేదికగా ప్రచారం చేస్తారని కంపెనీ తెలిపింది. ‘‘ఫిట్‌నెస్‌ పట్ల రాజీలేని తత్వం, ఫ్యాషన్‌ పట్ల మంచి అభిరుచిని కలిగిన ఉన్న బూమ్రా దేశంలో ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి యువ క్రికెటర్‌తో భాగసామ్యం ద్వారా బ్రాండ్‌ థీమ్‌ ‘నెవర్‌ సెటిల్‌’ అనే ట్యాగ్‌లైన్‌కు పరిపూర్ణత లభిస్తుందని విశ్వస్తున్నాము’’ అని కంపెనీ ఇండియా విభాగపు అధికారి ఒకరు తెలిపారు.

కాగా వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింన విషయం తెలిసిందే. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది.

చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు