లాభాల్లో రిలయన్స్‌ తర్వాత అతిపెద్ద కంపెనీ ఇదే.. టాటాలకు షాక్‌?

30 May, 2022 18:47 IST|Sakshi

ప్రైవేటీకరణ యత్నాలు జోరుగా సాగుతున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ లాభాలు సాధించడంలో జోరు చూపుతున్నాయి. మార్కెట్‌లో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. 

లాభాల్లో రికార్డు
ఆర్థిక సంవత్సరం 2021-22 నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల్లో ప్రభుత్వ రంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌ (ఓఎన్‌జీసీ) దుమ్మురేపింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో క్యూ 4లో రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్టు ఓఎన్‌జీసీ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే అత్యధికం. మిగిలిన మహారత్న, నవరత్న, మినీరత్నాలన్నీ ఓఎన్‌జీసీ తర్వాతే నిలిచాయి.

టాటా వెనక్కి
ఇక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన ఫలితాలను పరిశీలించినా ఓఎన్‌జీసీ అదిరిపోయేలా ఫలితాలు సాధించింది. ఓఎన్‌జీసీ కంటే కేవలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే అధిక లాభాలు గడిచింది. ఇప్పటి వరకు లాభాల్లో అగ్రభాగాన కొనసాగుతూ వస్తోన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి వాటిని వెనక్కి నెట్టింది.

యుద్ధం ఎఫెక్ట్‌
ఉక్రెయిన్‌ రష్యాల మధ్య తలెత్తిన యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆయిల్‌ ధరలు ఎగిసిపడ్డాయి. ఫలితంగా ఓఎన్‌జీసీ లాభాలు కూడా చివరి త్రైమానికంలో ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో అత్యధిక ఆయిల్‌ ఉత్పత్తి సామర్థ్యం ఓఎన్‌జీసీకే ఉంది. 

చదవండి: మాయదారి ట్విటర్‌..కరిగిపోతున్న మస్క్‌ సంపద!


 

మరిన్ని వార్తలు