కోవిడ్ ఎఫెక్ట్: వాటిని కొనేవారు లేక వెలవెలబోతున్న షాప్స్

4 May, 2021 19:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సాదారణంగా ప్రతి ఏడాది ఎండ కాలంలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది కూడా డిమాండ్ భారీగానే ఉంటుందని కంపెనీలు భావించాయి. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఏప్రిల్‌లో కోవిడ్ కేసుల విపరీతంగా పెరగడం వల్ల దాని ప్రభావం ఎయిర్ కండిషనర్లు, కూలర్ల వ్యాపారం మీద పడినట్లు బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. 70శాతం పైగా ఎయిర్ కండీషనర్ అమ్మకాలు జనవరి నుంచి జూన్ మధ్య జరుగుతాయని నివేదికలో తెలిపారు. 

వాస్తవానికి, "మార్చి నుంచి మే వరకు గల మూడు నెలల కాలంలో 50 శాతం అమ్మకాలు జరుగుతాయి. ఈ కాలంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఆ ప్రభావం పరిశ్రమలపై భారీగానే ఉంటుంది. ఏసీ కొనుగోలు చేయడం వల్ల సాంకేతిక నిపుణులు వచ్చి వాటిని బిగించాలి కాబట్టి, ప్రస్తుత పరిస్థితిలో ఏసీలను కొనుగోలు చేయడానికి సాంకేతిక కారణాలతో వినియోగదారులు వెనుకాడుతున్నారని" అని నివేదిక తెలిపింది. భారతదేశంలోని ప్రాంతాల్లో వేడి వేసవిని అంచనా వేయడంతో పాటు ఏడాది క్రితం నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి కంపెనీలు సీజన్‌కు సిద్ధమయ్యాయి. అలాగే, వేసవి ప్రారంభంలోనే వీటి ధరలను పరిశ్రమలు అధికంగా పెంచేసాయి. ఒకవైపు లాక్ డౌన్ ప్రభావం, మరోవైపు అధిక ధరలు అమ్మకాల మీద ప్రభావం చూపాయి. అనుకున్నంత స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా తగ్గించాయి.

చదవండి:

బ్రేకింగ్: 5జీ ట్రయల్స్ కు కేంద్రం ఆమోదం

మరిన్ని వార్తలు