Social Media Influencer: సోషల్‌ మీడియాలో వీళ్లది మామూలు హవా కాదు

20 Sep, 2021 09:04 IST|Sakshi

ముంబై: సోషల్‌ మీడియా వేదికలపై బ్రాండ్ల ప్రచారం గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ (ప్రభావితం చేసేవారు) మార్కెటింగ్‌ ఈ ఏడాది రూ. 900 కోట్లకు చేరనుంది. 2025 నాటికి ఇది 25 శాతం వార్షిక వద్ధి రేటుతో రూ. 2,200 కోట్లకు చేరనుంది. 


మీడియాలో ప్రకటనల స్పేస్‌ని కొనుగోలు చేసే సంస్థ గ్రూప్‌ఎం రూపొందించిన ఐఎన్‌సీఏ ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం ఊపందుకోవడంతో .. కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్‌లను నియమించుకునే ధోరణి కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 

కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితులతో ఈ తరహా మార్కెటింగ్‌ విధానాల్లో మార్పులు చోటు చేసు కుంటున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఫాలోవర్లకు ఉంటున్న నమ్మకాన్ని చూస్తున్న బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి వారితో జట్టు కట్టడంపై ఆసక్తి చూపుతున్నాయని గ్రూప్‌ఎం సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. 

ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌లో సుమారు 70 శాతం వాటా నాలుగు కేటగిరీలది ఉంటోంది. వీటిలో పర్సనల్‌ కేర్‌ (25 శాతం), ఆహారం..పానీయాలు (20 శాతం), ఫ్యాషన్‌..ఆభరణాలు (15 శాతం), మొబైల్‌.. ఎలక్ట్రానిక్స్‌ (10 శాతం) ఉన్నాయి. ఈ తరహా మార్కెటింగ్‌ ఆదాయాల్లో సెలబ్రిటీల వాటా 27 శాతం ఉండగా.. ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్ల వాటా ఏకంగా 73 శాతంగా ఉండటం గమనార్హం. 

చదవండి: YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! 

మరిన్ని వార్తలు