ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనాల‌ని అనుకుంటున్నారా? మీ పాన్ ను ఇలా అప్‌డేట్ చేయండి!

16 Feb, 2022 14:31 IST|Sakshi

 రాబోయే పబ్లిక్‌ ఇష్యూలో (ఐపీఓ) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్‌ అకౌంటు నంబరు (పాన్‌) వివరాలను.. పాలసీ రికార్డులో అప్‌డేట్‌ చేసుకోవాల్సి రానుంది. ఇదే విష‌యాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది.

అయితే ఇప్పుడు మ‌నం ఎల్ఐసీ పాల‌సీ లో పాన్ నెంబ‌ర్‌ను ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకుందాం.

 కార్పొరేషన్ వెబ్‌సైట్ www.licindia.in లేదా https://licindia.in/Home/Online-PAN-Registrationని సందర్శించండి

మీ పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడిని సిద్ధంగా ఉంచుకోండి, మీ పాన్‌ను అప్‌డేట్ చేస్తున్నప్పుడు నింపాల్సిన అవసరం ఉంది.

మీరు పై లింక్‌ని ఉపయోగించి మీ అన్ని LIC పాలసీల రికార్డులను అప్‌డేట్ చేయవచ్చు.

మీరు కార్పొరేషన్ వెబ్‌సైట్ www.licindia.in లేదా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusని సందర్శించడం ద్వారా మీ పాలసీలో మీ పాన్ అప్‌డేట్ అఅయ్యిందా లేదా అని తెలుసుకోవ‌చ్చు. 

► ప్రత్యామ్నాయంగా, మీరు మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని కూడా సంప్రదించవచ్చు.

  

మరిన్ని వార్తలు