-

RBI's new payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కీలక మార్పులు షురూ..

21 Dec, 2021 18:37 IST|Sakshi

New credit debit card rules for online payments from January 1, 2022 అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, బిగ్‌బాస్కెట్‌.. మీకిష్టమైన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో షాపింగ్‌ సులభతరం కానుంది. అవును.. జనవరి 1, 2022 నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా మీ చెల్లింపులు సులభతరం కావడమేకాకుండా, మీలావాదేవీల సమాచారం కూడా మరింత భద్రంగా ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇకపై 16-అంకెల కార్డ్ వివరాలను, కార్డ్ గడువు తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. 'టోకనైజేషన్' అనే కొత్త పద్ధతి ద్వారా త్వరగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు.

టోకనైజేషన్ అంటే ఏమిటి? కొత్త చెల్లింపు పద్ధతి ఎలా ఉండబోతోంది?
టోకనైజేషన్ అనేది క్లయింట్లు టోకెన్‌ ద్వారా కార్డు సమాచారాన్ని వినిమయించుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారంతో సంబంధంలేకుండా కొనుగోళ్లు సజావుగా సాగే విధానం. ఈ కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ కోసం సీవీవీ నంబర్ ఇకపై అవసరం లేదు. 

టోకనైజ్డ్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలి?
►టోకనైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేయవచ్చు. అయితే దేశీయ కార్డులు మాత్రమే ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ కార్డ్‌లకు టోకనైజేషన్ వర్తించదు.

►వినియోగదారులు ప్రొడక్ట్స్‌ను కొనుగోలుచేసే సమయంలో షాపింగ్ వెబ్‌సైట్‌కు చెందిన చెక్-అవుట్ పేజీలో కార్డు వివరాలను ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. అలాగే టోకనైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. 

►ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ కార్డు సమాచారాన్ని తప్పక సమర్పించాలి. తర్వాత టోకనైజేషన్‌ని ఎంచుకోవాలి. చెల్లింపుల సమయంలో ఇన్‌పుట్‌ని నిర్ధారించడానికి టోకెన్‌లు సహాయపడతాయి.

►ఈ పద్ధతి ద్వారా ఆన్‌లైన్ మోసాలకు చెక్‌ పెట్టొచ్చు. ఎందుకంటే.. హ్యాకర్ టోకెన్ నుండి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం అంత సులభమేమీకాదు.

చదవండి: Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..

మరిన్ని వార్తలు