టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం..

16 Feb, 2024 16:21 IST|Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఏఐ గురించి తెలియని చాలామంది కూడా ఈ రోజు తెగ ఉపయోగించేస్తున్నారు. ప్రశ్న నీది, సమాధానం నాది అనే రీతిగా.. సర్చ్ బాక్స్‌లో సర్చ్ చేసే విషయానికి సమాధానం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ సంస్థ 'సొర' (Sora) అనే ఏఐ మోడల్‌ పరిచయం చేసింది.

ఇప్పటి వరకు మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తే.. సమాధానం కూడా టెక్స్ట్ రూపంలోనే వచ్చేది. అయితే ఇప్పుడు 'ఓపెన్ఏఐ సొర' మీరు ఎంటర్ చేసే టెక్స్ట్‌కు వీడియోలను క్రియేట్ చేస్తుంది. వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది నిజమే. అంటే సొర ఇప్పుడు వాస్తవ ప్రపంచానికి దగ్గరగా కనిపించే వీడియోలను క్రియేట్ చేస్తుంది.

సొర (Sora)
ఓపెన్ఏఐ పరిచయం చేసిన సొర మనం ఇచ్చే టెక్స్ట్ అర్థం చేసుకుని దానికి తగిన విధంగా చిన్న వీడియోలు క్రియేట్ చేస్తుంది. వాస్తవానికి దగ్గరా తీసుకెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే కంపెనీ సొరను పరిచయం చేసింది. అయితే ఇది కేవలం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోలను మాత్రమే క్రియేట్ చేయగలదు. వీడియో కూడా హై-క్వాలిటీలో ఉంటుంది. ఇప్పటికే సొర రూపోంచిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓపెన్ఏఐ సొర మనం ఎంటర్ చేసే టెక్స్ట్ అర్థం చేసుకుంటే దానికి తగిన వీడియోలను డెలివరీ చేస్తుంది. అంటే మనం అందించే టెక్స్ట్ చాలా స్పష్టంగా ఉండాలి. ప్రస్తుతం ఇది ఏఐ మోడల్ రీసెర్చర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని త్వరలోనే సాధారణ యూజర్లందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ కృషి చేస్తోంది. 

ఈ టెక్నాలజీ అద్భుతాలను సృష్టించడానికి మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారాలైన ద్వేషపూరిత ప్రసంగం, పక్షపాతం వంటి హానికరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉందని, ఇలాంటి వాటిని గుర్తించి, నిరోధించడానికి కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం.

ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు..

whatsapp channel

మరిన్ని వార్తలు