ఒప్పో ఏ15... ధర ఎంతంటే..

15 Oct, 2020 16:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒప్పో  ఏ15 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బిగ్ డిస్ ప్లే,  ట్రిపుల్ కెమెరాలు,  మీడియాటెక్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో దీన్ని లాంచ్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకానికి ముందు ఒప్పో కొత్త ఏ సిరీస్ ఫోన్  విడుదల చేయడం విశేషం. 

ఒప్పో ఏ15 ధర
ఒప్పో ఏ15 సింగిల్ వేరియంట్‌లో లభ్యం. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌  ధర రూ .10,990.  డైనమిక్ బ్లాక్ మిస్టరీ బ్లూ రంగులలో వస్తుంది. అ అమెజాన్‌లో ఆన్‌లైన్  ద్వారా  దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పటినుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండేదీ  ఒప్పో ఇంకా ప్రకటించలేదు. 

ఒప్పో ఏ15  ఫీచర్లు
6.52 అంగుళాల డిస్ ప్లే
720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.2 
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్‌
13+2+2 ఎంపీ రియల్ ట్రిపుల్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230 ఎంఏహెచ్ బ్యాటరీ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు