ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్

16 Dec, 2020 20:45 IST|Sakshi

అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఎ15ఎస్, ఒప్పో ఎ15 సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. డిసెంబర్‌ 21 నుంచి ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా, రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఒప్పోఎ15ఎస్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ.11,490. ఇది డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్ మరియు రెయిన్ బో సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: క్యూఎల్‌ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ)

ఒప్పో ఎ15ఎస్ ఫీచర్స్:
ఒప్పో ఎ15ఎస్ కలర్‌ఓఎస్ 7.2పై నడుస్తుంది. ఇది 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఒప్పో ఎ15ఎస్ 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఒప్పో ఎ15ఎస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ అభించనుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే చెల్లుతాయి.

>
మరిన్ని వార్తలు