ఒప్పో ఏ55 5జీ వచ్చేసింది!

25 Jan, 2021 19:43 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ55 5జీని చైనాలో విడుదల చేసింది. ఒప్పో ఏ55 5జీ 6జీబీ ర్యామ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ఫోన్ బిగ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?)

ఒప్పో ఏ55 5జీ ఫీచర్స్ 
డ్యూయల్ సిమ్ ఒప్పో ఏ55 5జీ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే కలర్‌ఓఎస్ 11పై నడుస్తుంది. ఇది 6.5-అంగుళాల ఎల్‌సిడి వాటర్‌డ్రాప్-స్టైల్ హెచ్‌డి ప్లస్(720x1,600 పిక్సెల్స్) డిస్ ప్లేను అందించారు. ఇది 6 జీబీ ర్యామ్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ(1టీబీ వరకు పెంచుకోవచ్చు) ఉంది. ఒప్పో ఏ55 5జీలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ఎఫ్/2.2 ఎపర్చరుతో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. 

సెల్ఫీ కోసం ఇందులో ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఒప్పో ఏ55 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5(802.11ac), బ్లూటూత్ v5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. దీని బరువు 186 గ్రాములు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కొత్త ఒప్పో ఏ55 5జీలో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర చైనాలో సిఎన్ వై1,599 (సుమారు రూ.18,000)గా ఉంది. ఇది బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మరిన్ని వార్తలు