18న రానున్న ఒప్పో ఎన్‌కో ఎక్స్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్

12 Jan, 2021 15:00 IST|Sakshi

ఒప్పో ఇండియా కొత్త ఎన్‌కో ఎక్స్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, ఒప్పో రెనో 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 18న విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ రెండింటిని చైనాలో ఇప్పటికే విడుదల చేసారు. చైనాలో ఒప్పో ఎన్‌కో ఎక్స్ ధర సిఎన్‌వై 999(సుమారు రూ .11,000)కు, ఒప్పో రెనో 5 ప్రో 5జీ ధర సీఎన్‌వై 3,399(సుమారు రూ.38,200)కు అందుబాటులో ఉన్నాయి.(చదవండి: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా)

ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్:
ఒప్పో రెనో 5 ప్రోలో 6.55-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ 90హెర్ట్జ్ డిస్ప్లేను 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిలో కలిగి ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్, 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోలను తీయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

ఒప్పో రెనో 5 ప్రో 5జీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ 5జీ ఫోన్ లో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో పని చేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, ఎస్‌ఐ/ఎన్‌ఎస్‌ఎ, డ్యూయల్ 4జీ వోల్‌టిఇ, వై-ఫై 802.11ఎసి, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సి, డ్యూయల్ సిమ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనిని అరోరా బ్లూ, మూన్‌లైట్ నైట్, స్టార్రి నైట్ రంగులలో అందుబాటులోకి రానుంది.

ఒప్పో ఎన్‌కో ఎక్స్ ఫీచర్స్:
ఈ ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందిస్తున్నాయి. ప్రతి ఇయర్‌పీస్‌లో 11 ఎంఎం మూవింగ్ కాయిల్ డ్రైవర్, 6 ఎంఎం ప్లేన్ డయాఫ్రాగమ్ డ్రైవర్ ఉంటుంది. ఇది ఎస్బీసి,ఏఏసి, ఎల్ హెచ్ డీసి వంటి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇవి 4 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్‌ కేస్‌తో అయితే 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఐపీ5‌4 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు