త్వరలోనే ఒప్పో ఎఫ్‌19ఎస్‌ లాంచ్‌..! ఎప్పుడంటే..?

22 Sep, 2021 21:21 IST|Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి ఓప్పో ఎఫ్‌19ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌ సెప్టెంబర్‌ 27 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌ తన అధికారిక సైట్‌లో ఒప్పో ఎఫ్‌19ఎస్‌ను టీజ్‌ చేసింది. గోల్డ్‌, బ్లాక్‌ వేరియంట్లలో ఒప్పోఎఫ్‌19ఎస్‌ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఒప్పో రెనో 6ప్రో స్మార్ట్‌ఫోన్‌ దీపావళికి అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎఫ్‌19ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20 వేలలోపు ఉండవచ్చునని తెలుస్తోంది. 

ఒప్పో ఎఫ్‌19ఎస్‌ ఫీచర్లు(అంచనా)

  • 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హోల్‌పంచ్‌ డిస్‌ప్లే 
  • ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662
  • ఆండ్రాయిడ్‌ 11
  • 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 48 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
  • 6జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 33వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • 5000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

చదవండి: Redmi Smart TV: తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీ లాంచ్‌ చేసిన రెడ్‌మీ...!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు