Oppo Mobile Processor: ఒప్పో సంచలన నిర్ణయం..! శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ కంపెనీలకు చెక్‌..!

6 Apr, 2022 17:51 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో సంచలన నిర్ణయం తీసుకుంది. శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీలకు పోటీగా  ఒప్పో తన మొదటి మొబైల్‌ ప్రాసెసర్‌ను లాంచ్‌ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. 

మొబైల్‌ ప్రాసెసర్లలో భాగంగా  ఇప్పటికే శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ సంస్థలు తమ సొంత మొబైల్‌ ప్రాసెసర్‌ చిప్‌లను తయారుచేసింది. థర్డ్‌ పార్టీ కంపెనీలపై ఆధారపడకుండా  తన మొదటి మొబైల్ ప్రాసెసర్‌ను తీసుకురావాలని ఒప్పో సన్నద్ధమైంది. ఈ చిప్‌సెట్‌ను ఒప్పో 2024లో  విడుదల చేయనున్నట్ల తెలుస్తోంది. ఇది శామ్‌సంగ్, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.  ఒప్పో గత కొద్ది రోజులుగా స్వీయ అభివృద్ధి చెందిన అప్లికేషన్‌ ప్రాసెసర్‌పై పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ పనులు 2023లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

యాపిల్‌కు సరఫరా చేస్తోన్న కంపెనీతో..!
యాపిల్‌కు చిప్స్‌ను సరఫరా చేస్తోన్న టీఎస్‌ఎంసీ చిప్‌ కంపెనీ ఒప్పో కస్టమ్‌ చిప్‌ను తయారుచేయనున్నటు​ సమాచారం. కాగా ప్రస్తుతం ఒప్పో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌(ఎన్‌పీయూ) చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో అధిక-నాణ్యత కల్గిన చిత్రాలను ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతోంది. కాగా థర్డ్‌ పార్టీ చిప్‌ సెట్స్‌ ఆధారపడకుండా సొంత చిప్‌ సెట్‌ను తయారుచేసేందుకు ఒప్పో సిద్దమైంది. ఇప్పటికే శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్లలో Exynos చిప్‌సెట్‌, యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లలో ఏ-సిరీస్‌ను, గూగుల్‌ టెన్సార్‌ చిప్‌ సెట్‌లను  కలిగి ఉంది.  చిప్‌ సెట్‌ తయారీలో భాగంగా ఓప్పో భారీ పెట్టుబడులను పెట్టనున్నుట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం... ఇప్పటికైతే ఒప్పో క్వాలకం, మీడియాటెక్‌ సంస్థల ప్రాసెసర్లను ఉపయోగిస్తోంది. 

చదవండి: వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు...!

మరిన్ని వార్తలు