ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్

11 Dec, 2020 18:30 IST|Sakshi

ఒప్పో రెనో5 5జీ, ఒప్పో రెనో5 5జీ ప్రో స్మార్ట్ ఫోన్ లను చైనాలో విడుదల చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకురాలేదు. డిసెంబర్ 24న రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఒప్పో రెనో5 5జీలో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌, ఒప్పో రెనో5 5జీ ప్రోలో మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ ని తీసుకొస్తున్నారు. ఈ రెండు మొబైల్ లో కూడా 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 64వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మొబైల్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు ఫోన్‌లు డిసెంబర్ 18న చైనాలో ఫస్ట్ సేల్ కి వస్తాయి.     

ఒప్పో రెనో5 5జీ ఫీచర్స్ 
ఒప్పో రెనో 5 6.00-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్‌ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్‌ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 172 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 30,400, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.33,800.

ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్
ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1000ప్లస్ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్‌ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్‌ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 38,300, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.42,800. భారతదేశంలో ఎప్పుడు తీసుకు వస్తారో తెలియదు. 
 

మరిన్ని వార్తలు