ఎలక్ట్రిక్ వాహన మార్కెట్​పై స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల దండయాత్ర!

22 Nov, 2021 17:17 IST|Sakshi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. 

(చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్‌లిమిటెడ్‌..!)

ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. 

(చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!)

మరిన్ని వార్తలు