ఒ‍ప్పో దూకుడు: ఆరేళ్లలో కోటి స్మార్ట్‌ఫోన్లు 

17 Apr, 2021 11:53 IST|Sakshi

కోటి దాటిన ఒప్పో ఎఫ్‌ సిరీస్‌ సేల్స్‌

ఆరేళ్లలో కీలక మైలురాయి :  ఒప్పో ఇండియా సీఈఓ దమయంత్ సింగ్ ఖానోరియా

సాక్షి న్యూఢిల్లీ: స్మార్ట్‌ డివైస్‌ బ్రాండ్‌ ఒప్పో ఎఫ్‌ సిరీస్‌లో ఒక కోటికిపైగా ఫోన్లను విక్రయించింది. ఆరేళ్లలోనే ఈ ఘనతను సాధించినట్టు కంపెనీ తెలిపింది. డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా, 25 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, స్లీక్‌ డిజైన్‌ మోడళ్లను తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఎఫ్‌ సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది.

ఇటీవల ప్రారంభించిన ఎఫ్ 19 ప్రో సిరీస్ ఎఫ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలపై బలమైన ప్రభావాన్ని చూపించిందని ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖానోరియా  వెల్లడించారు. ఎఫ్ 19 ప్రో సిరీస్‌ లాంచ్‌ అయిన  మూడు రోజుల్లోనే 230 కోట్ల రూపాయల విలువైన రికార్డు అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ఇటీవలే కంపెనీ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో స్లీక్‌ మోడల్‌ ఎఫ్‌-19ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు