Oppo Reno 6: ఇండియాలోనే ఫాస్టెస్ట్‌ 5జీ ఫోన్‌... రిలీజ్‌ ఎప్పుడంటే?

12 Jul, 2021 13:04 IST|Sakshi

పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌, దుమ్మురేగిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్‌ చేసేందుకు ఒప్పో రంగం సిద్ధం చేసింది. జులై 14న సరికొత్త ఒప్పో రెనో 6 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనుంది. ఇప్పటి వరకు మిడ్‌రేంజ్‌ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో ఒప్పో నుంచి వచ్చిన రెనో సీరిస్‌ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకున్నాయి.

పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌
ఇటీవల కాలంలో పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌గా గుర్తింపు పొందిన  మీడియాటెక్‌ డైమెన్సిటీ 900ని ఈ మొబైల్‌లో ఉపయోగించారు. ఈ ప్రాసెసర్‌ 5జీని సపోర్ట్‌ చేయడంతో పాటు  108 మెగాపిక్సెల్‌ కెమెరా, 120 గిగాహెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైఫై 6 కనెక్టివిటీ, ఆల్ట్రా ఫాస్ట్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ పనులు అద్భుతంగా నిర్వహిస్తుందనే పేరుంది. హాట్‌స్పాట్‌ని ఆన్‌ చేసి ఉంచనప్పుడు బ్యాటరీ డ్రైయిన్‌ కాకుండా ఎక్కువ సేపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కంపెనీలతో పోల్చితే కనీసం 30 శాతం బ్యాటరీ  ఎక్కువగా వస్తుందని చెబుతోంది.

ఫాస్టెస్ట్‌ 5జీ
మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ని ఉపయోగించడం ద్వారా ఇండియాలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తున్నామని ఒప్పో రీసెర్చ్‌ , డెవలప్‌మెంట్‌ వైస్ ప్రెసిడెంట్‌ తస్లీమ్‌ ఆరీఫ్‌ అన్నారు.  అత్యంత వేగవంతమైన ఫోన్‌లో గేమింగ్‌, వీడియోగ్రఫి, వీడియో కంటెంట్‌ చూసేప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.

మీడియాటెక్‌
ప్రస్తుతం హై ఎండ్‌ ప్రీమియం ఫోన్లు ఎక్కువగా స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే వాటికి ధీటుగా మీడియాటెక్‌ ఇటీవల డైమెన్సిటీ 900ని మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. దీంతో కొత్త ప్రాసెసర్‌తో రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ని  ఒప్పో ఫోన్‌ తీసుకు వస్తోంది. 
 

మరిన్ని వార్తలు