ORS Creater Death: కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త ఇకలేరు

17 Oct, 2022 16:33 IST|Sakshi

కోలకతా: ప్రముఖ వైద్యుడు,  ఓఆర్‌ఎస్‌ (ఓరల్ రీహైడ్రేషన్ థెరపీకి) ఆద్యుడు డాక్టర్ దిలీప్ మహలనాబిస్ (87) ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. (క్రికెట్‌ వైరల్‌ వీడియో: ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌, నెటిజన్ల నోస్టాల్జియా)

ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అపూర్బా ఘోష్ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో కలరా , ఎంటెరిక్ వ్యాధుల చికిత్సలో మహలనాబిస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే అతని  రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఘోష్ పేర్కొన్నారు.  శిశువైద్యునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో, పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్నప్పుడు కలరా వ్యాప్తి  చెందినపుడు డాక్టర్‌ దిలీస్‌ ఓఆర్‌ఎస్‌  ద్రావణంతో వేలాది మంది ప్రాణాలను రక్షించి వార్తల్లో నిలిచారు. 

కాగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నివారించడానికి ఓఆర్‌ఎస్‌ ద్రావణానికి  మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ థెరపీ శరీరంలోని ఉప్పు, చక్కెర, ఇతర ద్రవాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ఒ‍క విధంగా ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది.  గతంలో కోలకతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అభివృద్ధికి మహలనాబిస్ దంపతులు కోటి విరాళాన్ని  అందించడం గమనార్హం.  (5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్‌)

మరిన్ని వార్తలు