Oscar Awards: ఆస్కార్‌ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ..

12 Mar, 2023 12:25 IST|Sakshi

ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం భూమిని బహుమతిగా అందించబోతోంది. ఎక్కడా అనుకుంటున్నారా..?

ఆస్కార్ నామినీలు ఈ ఏడాది తమ గిఫ్ట్ బ్యాగ్‌లలో ఆస్ట్రేలియాలో ఒక చదరపు మీటర్ భూమిని అందుకోబోతున్నారు. అయితే ఆ భూమిని నామినీలు ఆధీనంలోకి తీసుకోలేరు. కానీ ఆ భూమి ఆస్కార్‌ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా అన్నమాట.

ఇదీ చదవండి: ట్విటర్‌ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర వ్యాఖ్యలు!

సాధారణంగా ఆస్కార్ నామినీలకు బహుమతులు ఇచ్చేందుకు అకాడమీతో సంబంధం లేకుండా అనేక వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్‌ ఎ‍స్టేట్‌ సంస్థ ఒకటి. నామినీలకు ఇచ్చే గిఫ్ట్‌ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి 4 వేల డాలర్లు (రూ.3,27,862) చెల్లించింది.

 

నామీనీల గిఫ్ట్‌ బ్యాగ్‌లో పీసెస్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సంస్థ తమ ‘ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్’ను చేర్చింది. దీని ద్వారా క్వీన్స్‌ల్యాండ్‌లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో ఒక చదరపు మీటర్ స్థలం ఆస్కార్‌ నామినీల పేరుపై ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్‌ సర్టిఫికెట్‌ను గ్రహీతలకు అందిస్తారు.

‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో కొంత భాగాన్ని పీసెస్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్‌ నామినీలకు బహుమతిగా ప్రకటించింది. కాగా ఈ  భూమి మొత్తం 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పేర్కొంది.  దీన్ని విక్రయిస్తే వచ్చే లాభం 2.5 మిలియన్‌ డాలర్లు వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే బొగ్గు సీమ్ గ్యాస్ ఫీల్డ్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై పర్యావరణ సంస్థల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే..

మరిన్ని వార్తలు