ఓటీటీలకు షాక్‌: సీవోఏఐ కొత్త ప్రతిపాదన

25 Nov, 2022 06:17 IST|Sakshi

సీవోఏఐ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) కమ్యూనికేషన్స్‌ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్‌ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. టెల్కోల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ సేవలు అందిస్తున్నందున అవి నేరుగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది.  

టెలికం బిల్లు ముసాయిదాలో ఓటీటీ కమ్యూనికేషన్స్‌ సేవలకు సంబంధించిన నిర్వచనం విషయంలో తాము ఈ మేరకు సిఫార్సులు చేసినట్లు సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ తెలిపారు. టెల్కోలకు ఓటీటీ సంస్థలు పరిహారం చెల్లించే అంశానికి సంబంధించి..  ఆదాయంలో వాటాల విధానాన్ని పరిశీలించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఇతర ఓటీటీలకు (అన్ని కేటగిరీలు) కూడా డేటా వినియోగం ఆధారిత ఆదాయ పంపకం సూత్రాన్ని వర్తింప చేయవచ్చని కొచర్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు