youtube: యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్‌ వీడియోస్‌

18 Sep, 2021 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ: టీవీల్లోనూ యూట్యూబ్‌ వీక్షణం పెరుగుతోంది. మే నెలలో 20 కోట్లకు పైగా కుటుంబాలు టీవీ తెరపై యూట్యూబ్‌ను వీక్షించాయని కంపెనీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదల అని వివరించింది. ‘హిందీ, తెలుగు, తమిళం వంటి దేశీయ భాషల కంటెంట్‌ను ఆస్వాదించే వారి సంఖ్య అధికం అవుతోంది. 

యూట్యూబ్‌ వీక్షకుల్లో వీరి వాటా 93 శాతం. యూట్యూబ్‌ను చూసేందుకు మొబైల్‌ ఫోన్‌ నుంచి టీవీల వైపు మళ్లుతున్నారు.  క్రితంతో పోలిస్తే కోవిడ్‌–19 సమయంలో యూట్యూబ్‌ను అధికంగా ఆస్వాదిస్తున్నట్టు 85 శాతం మంది వీక్షకులు తెలిపారు. వీడియోల ద్వారా తాము ఆసక్తి ఉన్న విభాగాల్లో నైపుణ్యం పెంచుకున్నట్టు 85 శాతం మంది చెప్పారు. 

మే నెలలో కెరీర్‌ సంబంధ వీడియోల వీక్షణ సమయం 60 శాతం పెరిగింది. వ్యవసాయం, ఆర్థిక, ఆహారం, ఇంజనీరింగ్‌ వంటి విభాగాలు కొత్తగా వృద్ధి చెందుతున్నాయి. సాంకేతికత, సౌందర్యం, హాస్యం వంటి విభాగాల్లో స్థానిక భాషల కంటెంట్‌ అధికం అవుతోంది. 140 చానెళ్లకు ఒక కోటికిపైగా, 4,000లకుపైగా చానెళ్లకు 10 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. షార్ట్స్‌ ప్లేయర్‌లో ప్రపంచవ్యాప్తంగా రోజూ 1,500 కోట్ల షార్ట్‌ వీడియోస్‌ వ్యూస్‌ నమోదవుతున్నాయి’ అని యూట్యూబ్‌ తెలిపింది.   

చదవండి : యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి!  

మరిన్ని వార్తలు