దూసుకెళ్తున్న ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు.. 37 వేల ఫీచర్‌ ఫోన్లలో యూపీఐ సేవలు!

29 Mar, 2022 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ లేనప్పటికీ యూపీఐ123పే సర్వీస్‌ ద్వారా ఫీచర్‌ ఫోన్‌ వాడకందార్లు డిజిటల్‌ చెల్లింపులు చేయవచ్చు. భారత్‌లో 2022 మార్చి 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలను వినియోగించేందుకు 37 వేలకుపైగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 21,833 డిజిటల్‌ చెల్లింపులు పూర్తి అయ్యాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె కరద్‌ పార్లమెంటుకు తెలిపారు. ‘యూపీఐ సేవలను విదేశాల్లోనూ విస్తరించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌(ఎన్‌ఐపీఎల్‌) కృషి చేస్తోంది. భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ(బీహెచ్‌ఐఎం) యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ వినియోగించి సింగపూర్, భూటాన్, యూఏఈ, నేపాల్‌లోని వర్తకులకు చెల్లింపులు చేయవచ్చు’ అని వెల్లడించారు.

(చదవండి: రాబోయేదీ యథాతథ విధానమే: భట్టాచార్య)

మరిన్ని వార్తలు