ప్రొక్టెర్‌ అండ్‌ గ్యాంబుల్స్‌ అతి పెద్ద కర్మాగారం తెలంగాణలో

2 May, 2022 19:37 IST|Sakshi

ఫాస్ట్ మూవింగ్‌ కన్సుమర్స్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ)లో దిగ్గజ కంపెనీ ప్రొక్టెర్‌ అండ్‌ గ్యాంబుల్స్‌ (పీ అండ్‌ జీ)కి ఇండియాలో అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కి తెలంగాణ వేదికగా మారింది. ఈ సంస్థకు చెందిన ప్లాంట్‌ను ఇటీవల విస్తరించారు. దీంతో ఇండియాలోనే పీ అండ్‌ జీకి అతి పెద్ద సెంటర్‌గా తెలంగాణ నిలిచింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో ఈ సంస్థకు ప్లాంట్‌ ఉంది. ఇటీవల లిక్విడ్‌ డిటర్జెంట్‌ తయారీ కోసం ఈ ప్లాంటును విస్తరించారు. దీంతో 170 ఎకరాల్లోక సువిశాల కర్మాగారంగా పీ అండ్‌ జీ అవతరితంచింది. నూతనంగా నిర్మించిన డిటర్జెంట్‌ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ మే 2న ఆవిష్కరించారు. పీ అండ్‌ జీ నుంచి ఏరియల్‌, టైడ్‌ వంటి డిటర్జెంట్‌ లిక్విడ్స్‌, పౌడర్లు మార్కెట్‌లో ఉన్నాయి. 2014లో పీ అండ్‌ జీ ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేయగా తాజాగా రూ.200 కోట్లతో దాన్ని మరింతగా విస్తరించింది. 

ఈ సిటీలో రేడియంట్‌ ఫ్యాక్టరీ
నగర శివారల్లో ఈ సిటీలో రేడియంట్‌ సంస్థ తమ ఫ్యా‍క్టరీని విస్తరించింది. వంద కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విస్తరణ పనులు చేపడుతోంది. దీని వల్ల కొత్తగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విస్తరణతో ఫ్యాక్టరీ తయారీ సామర్థ్యం ఏడాదికి నాలుగున్నర లక్షల టీవీ సెట్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో దేశంలో తయారయ్యే టీవీల్లో నాలుగో వంతు హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తి కానున్నాయి.
 

చదవండి: ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు

మరిన్ని వార్తలు