రూ. 88 వేల కోట్లకు పీ-నోట్స్‌ పెట్టుబడులు డౌన్‌

14 Apr, 2023 08:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్ల వేల్యుయేషన్లు గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న నేపథ్యంలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ-నోట్స్‌) రూపంలో వచ్చే పెట్టుబడుల విలువ ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లకు పరిమితమైంది. జనవరిలో ఇవి రూ. 91,469 కోట్లుగా నవెదయ్యాయి. పీ-నోట్ల పెట్టుబడులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. 

నేరుగా రిజిస్టర్‌ చేసుకోకుండా భారత వర్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయదల్చుకునే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పీ-నోట్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్‌లో పీ-నోట్ల పెట్టుబడుల విలువ ర. 96,292 కోట్లుగా, నవంబర్‌లో ర. 99,335 కోట్లుగా, అక్టోబర్‌లో రూ. 97,784 కోట్లుగాను ఉన్నాయి. 

ఇతర వర్ధవన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్‌ ఖరీదైనదిగా ఉంటోందని ఎఫ్‌పీఐలు భావిస్తున్నారని నిపుణులు తెలిపారు. భారత్‌లో లాభాలు బుక్‌ చేసుకుని, ఇతరత్రా చౌక మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయ్యాలనే ఆచనతో వారు ఉన్నట్లు వివరించారు. పీ-నోట్ల రపంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన పెట్టుబడుల్లో ర. 78,427 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,851 కోట్లు డెట్‌లోన, రూ. 119 కోట్లు హైబ్రిడ్‌ సెక్యరిటీల్లోను ఉన్నాయి.

మరిన్ని వార్తలు