Paint Companies: సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు..! ఈ సారి పెయింట్‌ రూపంలో..!

25 Nov, 2021 18:21 IST|Sakshi

Paint Companies To Hike Prices In December Again: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, అధిక రిటైల్‌ ద్రవ్యోల్భణంలో సతమతమవుతున్న  సామాన్యుల నెత్తి మీద మరో భారం పడనుంది. దేశవ్యాప్తంగా పెయింట్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఇంధన వ్యయాలతో పోరాడుతున్న పెయింట్‌ కంపెనీలు మార్జిన్‌లను కాపాడుకునేందుకు గాను వరుసగా మరోసారి పెయింట్‌ధరలను పెంచనున్నాయి.

పెయింట్‌ ఇండస్ట్రీలో సుమారు 50 శాతం మేర వాటాలను కల్గిన ఏషియన్‌ పెయింట్స్‌, బెర్జర్‌ కంపెనీలు వచ్చే నెల 5 నుంచి సుమారు 4-6 శాతం మేర పెయింట్‌ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది మొత్తంగా పెయింట్‌ ధరలు రికార్డుస్థాయిలో 19-20 శాతం మేర పెరిగాయి. దిగ్గజ  పెయింట్‌ కంపెనీలు ధరల పెంపును ప్రకటించడంతో అక్జో నోబెల్ ఇండియా , ఇండిగో పెయింట్స్ వంటి పెయింట్‌ కంపెనీలు కూడా ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అధిక ద్రవ్యల్భోణం...!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్‌ రంగాల్లోని అంతరాయాలు నియంత్రణలోకి వచ్చిన ముడిసరుకు ఖర్చులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు తలకిందులైనాయి. పెయింట్‌ కంపెనీలు కనీస మార్జిన్‌ లాభాలను పొందేందుకుగాను కచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగల్ క్యూ2 ఫలితాల్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అత్యధిక  స్థాయిలో ఉంది. గత 40 ఏళ్లలో కనీస వస్తు ధరల్లో ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని చూడలేదని అమిత్‌ సింగల్‌ అన్నారు. ఒక వేళ ధరలను పెంచకపోతే కంపెనీల ఆపరేటింగ్‌ మార్జిన్‌ రేట్స్‌ భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆపరేటింగ్ మార్జిన్లను 18-20 శాతం స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజ్‌మెంట్ సూచించింది 

పెంపుదల అనివార్యం...
పెయింట్‌ ధరల పెంపు అనివార్యమని బెర్జర్‌ పెయింట్స్‌ ఎమ్‌డీ, సీఈవో అభిజీత్ రాయ్ అన్నారు. FY22 క్యూ2లో  దాదాపు అన్ని పెయింట్ కంపెనీలు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధించాయి. FY22 క్యూ4లో కనీసం నుండి 18 శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. 
చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

మరిన్ని వార్తలు