పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్‌ తప్పదు! డెడ్‌లైన్‌ ఎపుడో తెలుసా?

10 Dec, 2022 18:12 IST|Sakshi

సాక్షి, ముంబై: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మీరు లింక్‌ చేయకపోతే వెంటనే పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయాలి. లేని పక్షంలో  ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ కావు.అంతేకాదు ప్యాన్‌  చెల్లుబాటుకాదు. 

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పాన్  కార్డు హోల్డర్లందరూ  వచ్చే ఏడాది మార్చి కి ( 31.3.2023) లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. తరువాత నుంచి అంట 1.4.2023 నుండి లింక్‌ చేయని ప్యాన్‌ కార్డుపనిచేయదు.  కనుక ఆలస్యం చేయకుండా  సాధ్యమైనంత  తొందరగా లింక్‌ చేసుకోవడం బెటర్‌. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!)

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పలుమార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  డెడ్‌లైన్‌ను 2023 మార్చి 31గా ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది.  దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విటర్‌  ఖాతాలో హెచ్చరికను జారీ చేసింది. పాన్‌ను ఆధార్ తో అనుసంధానానికి విధించిన సాధారణ గడువు ముగిసిందని, అయితే గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది.

(లగ్జరీ ఎస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!)

ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్‌! ఎలా ?

మరిన్ని వార్తలు