మార్చిలోగా పాన్‌–ఆధార్‌ అనుసంధానం

19 Sep, 2021 04:59 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పాన్‌ కార్డ్‌ నంబర్‌తో ఆధార్‌ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. పాన్‌ నంబర్‌తో అనుసంధానానికి ఆధార్‌ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు  సమరి్పంచాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ ఏడాది సెపె్టంబర్‌ 30. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్‌ పాలసీ ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌ సురభి అహ్లువాలియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను చట్టం–1961 కింద జరిమానా విచారణలు పూర్తి చేయడానికి గడువు కూడా 2022 మార్చి 31 వరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు