బిట్‌కాయిన్‌కు మరో దేశం చట్టబద్ధత..!

26 Jun, 2021 18:08 IST|Sakshi

 గత కొన్ని రోజులనుంచి నేల చూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి తాజాగా కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయంతో  కొంతమేరకు ఉపశమనం కల్గనుంది. క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు ఎల్‌ సాల్వాడార్‌ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు పరాగ్వే దేశం కూడా చట్టబద్ధతను కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే ఆమోదించినున్నట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం లభిస్తే అధికారికంగా బిట్‌కాయిన్‌ను అంగీకరించే రెండో దేశంగా పరాగ్వే నిలవనుంది. 

పరాగ్వే పార్లమెంట్‌ సభ్యుడు కార్లిటోస్ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో దేశం మరింత వృద్ధిపథంలోకి నడుస్తోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి పతనమౌతున్న క్రిప్టోకరెన్సీకి ఈ నిర్ణయం కాస్తా ఉపశమనం కల్గుతుందని పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి మరింత ఆసక్తిని చూపిస్తున్నాయి. దీంతో వారి దేశాలు ఇతర దేశాల కంటే ఎక్కువ ప్రయెజనాలతో పాటు, బలమైన ఆర్థిక శక్తిగల దేశాలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని కార్లిటోస్‌ పేర్కొన్నారు. 

ఇరాన్‌లో నిరంతర బ్లాక్అవుట్ కారణంగా గత నెలలో బిట్ కాయిన్‌ను మూడు నెలలు పాటు  నిషేధించింది. బిట్‌కాయిన్‌పై ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు