మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ!

26 May, 2023 15:39 IST|Sakshi

సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా?

నెదర్లాండ్‌లోని లైడెన్‌లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్‌ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స​ చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్‌ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. 

కానీ అనూహ్యంగా సైన్స్‌, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్‌ బ్రెయిన్‌, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్‌ ఇంప్లాంట్స్‌ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. 

చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది!

సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది
నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్‌ ( న్యూరోసర్జన్‌) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్‌ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్‌ బ్రిడ్జ్‌ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. 

అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్‌పై లౌసాన్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్‌ డివైజ్‌ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్‌ తరహా బ్రెయిన్‌ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు.  

చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం?

బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ ఎలా జరిగింది
ముందుగా ప్రొఫెసర్‌ బ్లోచ్‌...ప్యారలైజ్‌తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్‌లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్‌లెస్‌ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్‌లను (డిజిటల్‌ బ్రిడ్జ్‌) బ్రెయిన్‌లో అమర్చారు. అవి జాన్‌ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్‌లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్‌ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్‌ చేయబడి బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. 

ఇలా బ్రెయిన్‌తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్‌ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్‌లు గుర్తించారు. ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన లౌసాన్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు.

నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
ఓస్కామ్‌ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. 

చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి!

మరిన్ని వార్తలు