పారిజాత హోమ్స్‌ నుంచి మూడు ప్రాజెక్ట్‌లు

28 Aug, 2021 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పారిజాత హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ నూతనంగా మూడు వెంచర్లను ప్రారంభించింది. ఆదిభట్ల, బాచారం, షామీర్‌పేట ప్రాంతాలలో రానున్న ఆయా ప్రాజెక్ట్‌ల బ్రోచర్లను ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, హాలీ లెజెండ్‌ ముఖేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 

ఆదిభట్లలో నిర్మించనున్న  పారిజాత ప్రైమ్‌లో 900 ఫ్లాట్లుంటాయి. బాచారంలోని తారామతి ఓఆర్‌ఓఆర్‌ ఎగ్జిట్‌ సమీపంలో కమర్షియల్‌ స్పేస్‌తో పాటు 390 నివాస గృహాలను కూడా నిర్మిస్తుంది. షామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్‌ ప్రక్కన 20 ఎకరాలలో పారిజాతా ఐకాన్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. మొత్తం 12 టవర్లలో 1,500 యూనిట్లుంటాయి. అన్ని ప్రాజెక్ట్‌లలో 1,100 చ.అ.లో 2 బీహెచ్‌కే, 1,650 చ.అ.లలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3,500లుగా నిర్ణయించామని’’ చైర్మన్‌ తాటిపాముల అంజయ్య తెలిపారు.  

మరిన్ని వార్తలు