‘ఇన్‌ఫ్రా’ జాతీయ బ్యాంకుకు పార్లమెంటు ఆమోదం

26 Mar, 2021 05:52 IST|Sakshi

న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు (నాబ్‌ఫిడ్‌ బిల్లు/నేషనల్‌ బ్యాంకు ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ సంస్థపై పార్లమెంటు పర్యవేక్షణ లేదన్న అంశాన్ని లెవనెత్తారు. సెలక్ట్‌ కమిటీకి పంపించాలంటూ డిమాండ్‌ చేశారు. చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ.. ఈ సంస్థకు సంబంధించి ఆడిట్‌ నివేదికలను ఏటా పార్లమెంటు పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ‘అధీకృత మూలధనం రూ.10లక్షల కోట్లను సమకూర్చనున్నాం. రూ.20,000 కోట్లను ఈక్విటీ కింద, రూ.5,000 కోట్లను గ్రాంట్‌ కింద ప్రభుత్వం మంజూరు చేసింది’’ అని మంత్రి తెలిపారు. సౌర్వభౌమ హామీ ఉంటుందని.. ఆర్‌బీఐ నుంచి రుణం పొందొచ్చన్నారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నాబ్‌ఫిడ్‌ రుణ వితరణ చేస్తుందన్నారు.   కాగా, నాబ్‌ఫిడ్‌ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్‌ పాండా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు