Land Rover: రూ.1.3 కోట్ల కారులో బాబా రామ్‌దేవ్ - వీడియో వైరల్

7 Oct, 2023 21:24 IST|Sakshi

ప్రముఖ యోగా గురువు 'బాబా రామ్‌దేవ్' సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 డ్రైవ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కారు ఎవరిదీ, దాని ధర ఎంత, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారుని పతంజలి CFA దివ్యాంశు కేసర్వాణి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఆటో వార్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్‌దేవ్‌ బాబా ఈ కారుని కొనుగోలు చేయలేదని యూపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్‌లోని పతంజలి గ్రూప్ సీఎఫ్ఓ ఇచ్చారని తెలిపారు.

ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర సుమారు రూ. 1.3 కోట్లు వరకు ఉంటుంది. సెడోనా రెడ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం వీడియోలో చూడవచ్చు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..

నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ & ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి.

A post shared by AUTO WAAR (@auto.waar)

మరిన్ని వార్తలు