Pawan Munjal: తిరుగులేని హీరో మోటోకార్ప్ సీఈఓ.. 40కి పైగా దేశాల్లో

13 Mar, 2023 11:16 IST|Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం దాని వెనుకుండి నడిపిస్తున్న ఎందరో కార్మికులు.

ప్రపంచంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడించిన హీరో మోటోకార్ప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'పవన్ ముంజాల్' నేతృత్వంలో ఇప్పుడు ముందుకు సాగుతోంది. బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. 2022 డిసెంబర్ 10 నాటికి పవన్ ముంజాల్, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 3.55 బిలియన్ డాలర్లు.

2011లో హీరో కంపెనీ హోండా నుంచి విడిపోయిన తరువాత పవన్ ముంజాల్ ముందుండి నడిపించి ప్రపంచ దేశాలకు విస్తరించడంతో గొప్ప కృషి చేశారు. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది.

(ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!)

ఇప్పటికి పవన్ ముంజాల్ నేతృత్వంలో భారతదేశంలో ఆరు సహా ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన హీరో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ లిమిటెడ్, బహదూర్ చంద్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కూడా ఒకరుగా ఉన్నారు.

హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో నిలదొక్కుకోవడానికి, 2022 అక్టోబర్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది.

మరిన్ని వార్తలు