పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!

17 Dec, 2022 20:58 IST|Sakshi

ఓ కాలేజీ కుర్రాడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఆ ఆలోచనకు సృజనాత్మకతను జోడించాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. అంతే ఆ బిజినెస్‌ పెద్ద హిట్‌ అయ్యింది. ఇదిగో సక్సెస్‌ అయిన ప్రతి కంపెనీ గురించి విన్నా, లేదంటే ఎవరైనా చెప్పినా..క్రియేటీవ్‌ థాట్స్‌ ఉండాలి. ఎవరూ స్టార్ట్‌ చేయని బిజినెస్‌ నేను స్టార్ట్‌ చేస్తే 100 శాతం అది క్లిక్‌ అవుతుంది’ అని చాలా మంది నమ్ముతారు. కానీ అది కరెక్ట్‌ కాదని అంటున్నారు పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ.

నిత్యం మనంరోజూ వారి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపించే బిజినెస్‌ ఐడియాతో వందల కోట్లు సంపాదించవచ్చని చెబుతున్నారు. అలాగే తనకు ఎదురైన ఓ సమస్యతో పేటీఎం బిజినెస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఓ సమావేశంలో వెల్లడించారు. 

పేటీఎంకు చిన్న సైజు ఏటీఎం
పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ వచ్చినప్పుడు వాటిని నమ్మడం చాలా కష్టమైంది. ఆ తర్వాత ఫోన్‌ పే, గూగుల్‌ పేలాంటి యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇక పేటీఎం అప్‌ అండ్‌ డౌన్స్‌ గురించి వినే ఉంటున్నాం. వాటిల్లో ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్‌ ఏంటంటే? మనం కిరాణా షాపులు, పాన్‌ షాపుల్లోకి  వెళితే ఓ డబ్బా నుంచి రిసీవ్‌డ్‌ అమౌంట్‌ ఆఫ్‌ సో అండ్‌ సో అనే ఆడియో వినపడుతుంది కదా. అది బ్రాండింగ్‌ కోసం పెట్టారని అనుకుంటాం. కానీ అది బ్రాండింగ్‌ కోసం పెట్టిన బాక్స్‌ కాదు. పేటీఎంకు కోట్లు కురిపించే ఓ చిన్న సైజ్‌ ఏటీఎం.  

గేమ్‌ ఛేంజర్‌ సౌండ్‌ బాక్స్‌ 
ఫిన్‌ టెక్‌ కంపెనీల్లో సౌండ్‌ బాక్స్‌ అనేది ఓ గేమ్‌ ఛేంజర్‌. ముఖ్యంగా షాపుల్లో రద్దీగా ఉన్న సమయంలో యజమానికి కస్టమర్‌ ఎంత చెల్లించారో చెప్పేలా అన్నీ స్థానిక భాషల్లో అలెర్ట్‌ ఇస్తుంది. అయితే ఆ సౌండ్‌ బాక్స్‌ వెనుక ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఉందని మీకు తెలుసా.

పాలబూత్‌లో చేదు అనుభవం
పేటీఎం సౌండ్‌బాక్స్ పై విజయ్ శేఖర్ శర్మ తన వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం నుంచి ఐడియా పుట్టింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ.. విజయ్ ఈ గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ గురించి స్పందించారు. తన ఇంటి సమీపంలో ఉన్న పాల బూత్‌లో పాల ప్యాకెట్‌ కొనేందుకు వెళ్లారు. పాల బూత్‌లో పాల ప్యాకెట్‌ కొన్నారు. పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్‌ చేశారు. కానీ పేమెంట్‌ చేసినట్లు మెసేజ్‌ రాకపోవడంతో సదరు షాపు యజమాని విజయ్‌ శేఖర్‌ శర్మని అడ్డగించాడు. పాల ప్యాకెట్‌కు డబ్బులు చెల్లించకుండా వెళతున్నారని అన్నారు. దీంతో కంగుతిన్న పేటీఎం సీఈవో సదరు పాల బూత్‌ యజమానిని ఫోన్‌ చూసుకోండి. పేమెంట్‌ చేశానని చెప్పారు. 

కానీ సదరు పాల వ్యాపారి ఫోన్‌ మెసేజ్‌ ఇన్‌ బాక్స్‌ నిండిపోవడంతో పేటీఎం సీఈవో చేసిన పేమెంట్‌ మెసేజ్‌ అలెర్ట్‌ రాలేదు. దీంతో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌లో కొన్ని మెసేజ్‌లు డిలీట్‌ చేయడంతో విజయ్‌ శేఖర్‌ శర్మ పాల ప్యాకెట్‌కు పేమెంట్‌ చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. అదిగో అప్పుడే పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మకు మెరుపులాంటి ఐడియా వచ్చింది.

వాట్‌ ఏన్ ఐడియా సర్‌జీ
పాల బూత్‌లో తనకు ఎదురైన సమస్యను పరిష్కరించాలని అనుకున్నారు. కస్టమర్లు పేమెంట్‌ చేసిన వెంటనే సౌండ్‌ అలర్ట్‌ వచ్చేలా వ్యాపారి, కస్టమర్ కు అనుసంధానం చేస్తూ ఓ డివైజ్ ను తయారు చేస్తే ఎలా ఉంటుందోనని అని ఆలోచించారు. అనేక తర్జన బర్జనల తర్వాత వచ్చిందే ఈ పేటీఎం సౌండ్‌ బాక్స్‌ ఐడియా. అలా పాల ప్యాకెట్‌ (పరోక్షంగా) తెచ్చిన అదృష్టంతో పేటీఎం సీఈవో వందల కోట్లు సంపాదించడం నిజంగా ఆశ్చర్యమే కదా.

వందల కోట్లు సంపాదన ఎలా? 
కిరాణా స్టోర్‌లో పేటీఎం సౌండ్‌ బాక్స్‌ పెట్టుకుంటే నెలకు రూ.125 రెంట్‌ కట్టాల్సి ఉంది. ఆ లెక్కన మొత్తం మన దేశంలో 2.1 మిలియన్ల మంది ఆ సౌండ్‌ బాక్స్‌ వినియోగిస్తుంటే యావరజ్‌గా రూ.125 చెల్లిస్తే.. నెలకు వందల కోట్లు అర్జిస్తున్నట్లే కదా.

మరిన్ని వార్తలు