Paytm: పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్‌లో మీ డబ్బులు ఆగిపోయాయా?..అయితే ఇలా తిరిగి తెప్పించుకోండి

5 Aug, 2022 14:31 IST|Sakshi

దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్‌ టెక్‌ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్‌లో లాగిన్‌ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్‌లో,వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్‌గ్గా లాగవుట్‌ అవుతుందని ట్విట్టర్‌లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్‌ డిక్టేటర్‌ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్‌ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్‌ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. 

నెట్‌వర్క్‌ ఎర్రర్‌
పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్‌ వర్క్‌ ఎర్రర్‌ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్‌ వర్క్‌ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్‌ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. 

ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం
యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్‌, వెబ్‌ సైట్‌లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే సమయంలో నెట్‌ వర్క్‌ సమస్య, మనీ స్ట్రక్‌ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్‌లను పరిగణలోకి తీసులేం.  తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్‌@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్‌ చేయాలని కోరింది.

మరిన్ని వార్తలు