తొలి సారిగా థర్డ్‌పార్టీ యాప్స్‌తో కరోనా వ్యాక్సిన్‌ బుకింగ్‌..!

18 Jun, 2021 21:14 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజ సంస్ధ పేటీయం తన యూజర్లకు తీపి కబురు అందించింది. పేటియం యాప్‌తో కరోనా వ్యాక్సిన్‌ బుక్‌చేసుకునే సదుపాయాన్ని కొత్తగా లాంచ్‌ చేసింది. పేటీయం అంతకముందు తమ యూజర్ల కోసం కరోనా వ్యాక్సిన్‌  స్లాట్‌ వివరాలను తెలుసుకునేందుకు ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’  అనే ఫీచర్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  కాగా థర్డ్‌పార్టీ యాప్‌తో కరోనా వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకోవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఆరోగ్యసేతు, ఉమాంగ్‌ యాప్‌, కోవిన్‌ వైబ్‌సైట్లను ఉపయోగించి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉండేది.

ప్రభుత్వం తాజాగా థర్డ్‌పార్టీ యాప్స్‌కు కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రజలకు కొంత సులువుకానుంది. పేటీయం యాప్స్‌తోనే కాకుండా ఎకా కేర్ యాప్‌తో కూడా కరోనా వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకోవచ్చునని తెలిపింది.

పేటీయం యాప్‌లో హోమ్‌పేజ్‌లో ఉన్న వ్యాక్సిన్ ఫైండర్‌పై క్లిక్‌ చేయండి. క్లిక్‌ చేసిన వెంటనే మీకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ బుక్ అపాయింట్‌మెంట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. బుక్‌పై క్లిక్‌ చేసిన తరువాత మీకు దగ్గరిలో ఉన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్లను చూపిస్తోంది. దీనిలో మీకు ఫ్రీ, పెయిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్లు కనిపిస్తాయి

చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..!

మరిన్ని వార్తలు