Paytm: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇప్పుడు మరింత సులువుగా..!

6 Jan, 2022 16:00 IST|Sakshi

పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌..! లావాదేవీలను మరింత సులువు చేస్తూ సరికొత్త పేమెంట్‌ పద్దతులను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. మొబైల్‌లో ఇంటర్నెట్‌ డేటా లేకుండా క్షణాల్లో లావాదేవీలను జరిపే ఫీచర్‌ను పేటీఎం తీసుకొచ్చింది. 

ట్యాప్‌ టూ పే...
ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ‘ట్యాప్‌ టూ పే’ సేవలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో యూజర్లు సులువుగా మనీ ట్రాన్సక్షన్లను జరపవచ్చునని పేటీఎం తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వారి పేటీఎం రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా పీఓఎస్‌ మెషీన్‌లో వారి ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పించనుంది. యూజర్ల  ఫోన్ లాక్‌లో ఉన్న,  లేదా మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా నగదు లావాదేవీలను పూర్తి చేయవచ్చును. ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. 

వివరాలు బహిర్గతం కావు..!
ట్యాప్ టు పే ఫీచర్‌లో భాగంగా...సెలెక్ట్‌డ్‌ డెబిట్‌ కార్డ్‌లోని 16-అంకెల ప్రైమరీ అకౌంట్‌ నంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా 'డిజిటల్ ఐడెంటిఫైయర్'గా మార్చనుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్‌లో యూజర్ల కార్డ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో థర్డ్‌ పార్టీ వ్యక్తులతో బహిర్గతం కాదు.  ఒక యూజర్‌ రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు...కార్డ్ వివరాలను బహిర్గతంచేయకుండా ఉండేందుకు పీఓఎస్‌ మెషిన్‌ దగ్గర ట్యాప్‌ చేసి పేమెంట్‌ చేయవచ్చును. రిటైల్ స్టోర్లలో వేగవంతమైన చెల్లింపు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటుగా, ఈ సదుపాయం పేటీఎం పీఒఎస్‌ పరికరాలతో పాటు ఇతర బ్యాంకుల పీఓఎస్‌ మెషీన్లకు కూడా వర్తించనుంది. తాజా ఫీచర్‌తో ఎన్‌ఎఫ్‌సీ(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) లావాదేవీలను కూడా జరపవచ్చును. 

చదవండి: ఈ బ్యాంకులు దివాలా తీయవ్‌ ! ఆర్‌బీఐ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు