Paytm: ఎల్‌పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

20 May, 2021 12:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికే ఆఫర్‌

రూ. 10-800 వరకు క్యాష్‌బ్యాక్‌ వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్‌ ధర కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 61 రూపాలయలకే గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తే.. ఏంటి జోక్‌ అనుకుంటున్నారా. కాదు వాస్తవమే. 861 రూపాయల విలువ చేసే గ్యాస్‌ సిలిండర్‌ కేవలం 61 రూపాలకే లభించనుంది.

గ్యాస్ సిలిండర్‌పై ఆఫర్ పొందటానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆఫర్ పొందొచ్చు. ఈవాలెట్ సంస్థ పేటీఎం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది.

పేటీఎం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌పై ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం మన దగ్గర గ్యాస్ సిలిండర్ ధర 861 రూపాయలుగా ఉంది. అంటే క్యాష్‌బ్యాక్ రూ.800 తీసేస్తే.. కేవలం 61 రూపాయలకే సిలిండర్ వచ్చినట్లు అవుతుంది. ఇక ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పొందాలని భావించే వారు పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారై ఉండాలి. వీరికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అయితే ఇక్కడ ఆఫర్‌లో ఒక మెలిక ఉంది. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే రూ.10 నుంచి రూ.800 వరకు మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ రూ.800 వస్తుందని చెప్పడానికి లేదు. రూ.10 కూడా రావొచ్చని గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డ్‌ వస్తుంది. ఇందులో మీకు ఎంత క్యాష్‌బ్యాక్‌ వచ్చింది అనేది ఉంటుంది.

పేటీఎం ద్వారా ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేయడానికి చర్యలు

1. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. దీని తరువాత, మీ గ్యాస్ ఏజెన్సీతో సిలిండర్ బుకింగ్ చేయవలసి ఉంటుంది.

3. దీని కోసం, పేటీఎం యాప్‌లో Moreకి వెళ్లి, ఆపై రీఛార్జ్, పే బిల్లులపై క్లిక్ చేయండి.

4. దీని తరువాత, మీరు సిలిండర్ బుక్ చేసే ఆప్షన్‌ వస్తుంది.

5. ఇక్కడ, మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.

6. బుకింగ్ చేయడానికి ముందు, మీరు FIRSTLPG ప్రోమో కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

బుకింగ్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాలి. క్యాష్‌బ్యాక్‌ డబ్బులు పేటీఎం వాలెట్‌కు 48 గంటల్లోగా వచ్చి చేరతాయి.

చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు