పేటీఎం ‘ట్యాప్‌ టు పే’..

11 Jan, 2022 08:48 IST|Sakshi

హైదరాబాద్‌: మొబైల్‌లో ఇంటర్నెట్‌ లేకపోయినా చెల్లింపులు చేసుకొనే సదుపాయాన్ని పేటీఎం తీసుకొచ్చింది. ఇందుకోసం ‘ట్యాప్‌ టు పే’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. దీని ద్వారా కస్టమర్లు నగదు లావాదేవీలను పేటీఎం రిజిస్టర్‌ చేసిన కార్డు ద్వారా పీఓఎస్‌ మెషీన్‌లో ఫోన్‌ ట్యాప్‌ చేసి నగదు పూర్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంది. 

ఫోన్‌ లాక్‌ చేసి ఉన్నా, మొబైల్‌లో డేటా లేకున్నా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండకపోయినా ఈ లావాదేవీలను సులభంగా చేయవచ్చని వివరించింది. ఇది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ ‘ట్యాప్‌ టూ పే’ సేవల ద్వారా రిటైల్‌ స్టోర్ల వద్ద వేగవంతమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందని తెలిపింది.  
 

మరిన్ని వార్తలు