పేటీఎం యూజ‍ర్లకు గుడ్‌న్యూస్‌ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్‌గా.. క్యాష్‌ బ్యాక్‌ కూడా!

24 Feb, 2023 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్‌ లేకుండానే చెల్లింపులు చేసేలా  పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్‌ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.  దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్‌ చేసు​కోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో  రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు.  రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు  లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి  రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ  లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని  పేటీఎం  పేర్కొంది. 

 ఏ బ్యాంకుల యూజర్లకు ఈ  సేవలు వర్తిస్తాయి
కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్‌ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి.  లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్‌ఎంఎస్‌, పేమెంట్స్‌ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. 

క్యాన్సిల్ ప్రొటెక్ట్  ఫీచర్‌
ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో  ‘క్యాన్సిల్‌  ప్రొటెక్ట్‌’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్‌  అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం  కస్టమర్‌నుండి  విమాన టికెట్ల  బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు  రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్‌ చేసిన బస్‌ టికెట్లపై 'క్యాన్సిల్‌ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్‌ చేసుకున్న తక్షణమే  సంబంధిత   ఖాతాలోకి  నగదు జమ అవుతుంది.

మరిన్ని వార్తలు