మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

3 Apr, 2022 08:17 IST|Sakshi

Paytm Buy Now Pay Later: అరెరె!! చేతిలో డబ్బులు లేవే. అర్జెంట్‌కు ఊరెళ్లాలి. ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తున్నారే. ఇప్పుడెలా? ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటే. ఊరెళ్తున్నాం కదా..వచ్చిన తరువాత ఇవ్వొచ్చులే. ఇదిగో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎం యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. చేతిలో డబ్బులు లేకపోయినా సరే పేటీఎం సాయంతో ఐఆర్‌సీటీసీలో ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. బుక్‌ చేసుకున్న ట్రైన్‌ టికెట్‌ డబ్బుల్ని పేటీఎం నిర్దేశించిన నిర్ణీత గడువు లోపు చెల్లించవచ్చు.

 

పేటీఎం సంస్థ ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో 'బై నౌవ్‌, పే లేటర్‌' (బీఎన్‌పీఎల్‌) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో పేటీఎంలో డబ్బులు లేకుండా వన్‌ క్లిక్‌తో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అంతేనా ట్రైన్‌ టికెట్ల నుంచి నిత్యవసర వస్తువుల వరకు.. నిత్యవసర వస్తువుల నుంచి షాపింగ్‌ వరకు డబ్బులు లేకుండానే మనకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయోచ్చు.

 

ఇందుకోసం పేటీఎం ఎటువంటి వడ్డీ లేకుండా రూ.60వేల వరకు ఆఫర్‌ చేస్తుంది. ఇక ఖర్చు చేసిన మొత్తాన్ని 30రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు  ఈఎంఐ సౌకర్యం అందిస్తామని పేటీఎం పేమెంట్‌ సర్వీస్‌ సీఈఓ ప్రవీణ్‌ శర్మ తెలిపారు. 

ట్రైన్‌ టికెట్‌లు ఎలా బుక్‌ చేయాలంటే?

ముందుగా ఐఆర్‌సీటీసీలోకి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో మీరు వెళ్లాల్సిన జర్నీ వివరాల్ని ఎంటర్‌ చేసి పేలేటర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి

పేలేటర్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే పేమెంట్‌ ఆప్షన్‌లో పేటీఎం పోస్ట్‌ పోయిడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది

ఆ పేటీఎం పోస్ట్‌ పెయిడ్‌ ఆప్షన్‌ పై ట్యాప్‌ చేస్తే డైరెక్ట్‌గా పేటీఎం యాప్‌ ఓపెన్‌ అవుతుంది

అందులో మీ వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాలి. ఆ తర‍్వాత ఓటీపీ ఎంటర్‌ చేసి ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 

చదవండి: మాకు బజాజ్‌ ఫైనాన్స్‌ ఒక్కటే బెంచ్‌మార్క్‌: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్‌ శర్మ

మరిన్ని వార్తలు