పేటీఎం ట్రావెల్‌ సేల్‌

18 Nov, 2022 08:32 IST|Sakshi

ఫ్లయిట్, బస్‌ టికెట్లపై డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్‌ 97 కమ్యూనికేషన్స్‌) ‘ట్రావెల్‌ సేల్‌’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్‌ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్‌ ఇండియా డొమెస్టిక్‌ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్‌ ఫ్లయిట్‌ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు తెలిపింది.

ఆర్‌బీఎల్‌ బ్యాంకు క్రెడిట్, డెబిట్‌ కార్డ్, అమెక్స్‌ కార్డ్‌లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్‌ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్‌ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది.

చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా!

మరిన్ని వార్తలు