66 లక్షల వినియోగదారులతో ‘పేటీఎం మనీ’

7 Sep, 2020 16:06 IST|Sakshi

బెంగుళూరు: దేశంలోని కస్టమర్లకు పేటీఎం యాప్‌ ద్వారా మెరుగైన సేవలను అందిస్తు వినియోగదారుల ప్రజాదరణ చూరగొంది. అయితే తాజాగా పైటీఎం మనీ విభాగం(వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్) అత్యాధునిక సేవలతో 66లక్షల మంది వినియోగదారుల సంఖ్యను చేరుకున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా ఈ విజయంపై పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందిస్తు మొదటిసారి వినియోగిస్తున్న వారే 70 శాతం ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని అన్నారు. అయితే 60 శాతం మంది వినియోగదారులు చిన్న పట్టణాలు, నగరాల  నుంచే తమ యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర పేన్సన్‌ పథకానికి, స్టాక్స్‌కు  పీటీఎం మెరుగైన సేవలందిస్తుంది. మరోవైపు లక్షలాది ప్రజల సంపదను పెంచడానికి పేటీఎమ్‌ మనీ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు పేటీఎం మనీ సీఈఓ వరుణ్‌ వశ్రీధర్‌ తెలిపారు. ప్రజల ఆదాయాలను పెంచే ఆత్మనిర్బహర్‌ భారత్‌ విజయం సాధించడంలో పేటీఎం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవలె స్టాక్‌ బ్రోకరేజ్‌ రంగంలోని పేటీఎం ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనికి కావాల్సిన అనుమతులను సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ద్వారా పొందింది. (చదవండి: పబ్‌జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు)

 

మరిన్ని వార్తలు