Paytm : మొబైల్‌ బిల్స్‌ పేమెంట్స్‌పై పేటీఎమ్‌ బంపర్‌ ఆఫర్‌...!

14 Sep, 2021 18:49 IST|Sakshi

Paytm Offers Rewards: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ తన యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ బిల్స్‌ పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను, ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించనుంది.  ప్రతి బిల్లు చెల్లింపులో యూజర్లకు సుమారు రూ .500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అంతేకాకుండా ప్రతి బిల్ చెల్లింపుపై సుమారు 5వేల వరకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పాయింట్లను కూడ పొందవచ్చును.  ఈ క్యాష్‌బ్యాక్‌ పాయింట్లతో ప్రముఖ  బ్రాండ్స్‌ డీల్స్‌, గిఫ్ట్ వోచర్లను పొందవచ్చును. 
చదవండి: వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్

జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, వీఐ  పోస్ట్‌పెయిడ్ సేవలకు సంబంధించిన అన్ని బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కోసం రివార్డులను పొందడమే కాకుండా, కంపెనీ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. యూజర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి పేటీఎం ఇటీవల మొబైల్ బిల్లు చెల్లింపులో భాగంగా  త్రీ టైమ్‌-క్లిక్ తక్షణ చెల్లింపు ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. యూజర్లు యూపీఐ, వ్యాలెట్‌, డెబిట్‌, క్రెడిట్‌, నెట్‌ బ్యాకింగ్‌ను ఉపయోగించి చెల్లింపులను చేయవచ్చును. 

చదవండి: Work From Home: భవిష్యత్తులో ఉద్యోగులు ఇలా ఉంటారా!
   

మరిన్ని వార్తలు