4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్‌

12 Apr, 2023 04:59 IST|Sakshi

ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్‌ 3.0 ని ఆవిష్కరించింది. రియల్‌ టైమ్‌ పేమెంట్‌ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్‌ ఇది. వాటర్‌ ప్రూఫ్‌ ఫీచర్‌ కలిగిన ఈ మేడిన్‌ ఇండియా ప్రాడెక్ట్‌ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది.

పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్‌ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్‌ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్‌ బ్యాక్‌ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్‌ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు.

మరిన్ని వార్తలు